మణుగూరు రెవెన్యూ సర్వే నెం. 138 లో హెచ్చరిక బోర్డు…
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు…తహసిల్దార్ రాఘవరెడ్డి.
నేటి గధర్ న్యూస్ మణుగూరు జూలై 5:
మణుగూరు రెవెన్యూ గ్రామం అశోక్ నగర్ సర్వే నెం. 138 లోని ఎ. 2.20 గుం. ల ప్రభుత్వ భూమిని కొందరు గిరిజనేతరులు రియల్ ఎస్టేట్ చేసే ఉద్దేశ్యంతో దూరక్రమణ చేస్తున్నారనే సమాచారం తెలియగా అట్టి భూమిలో తహసిల్దార్ ఆదేశాల మేరకు మణుగూరు ఆర్ఐ వన్ లీలావతి మరియు రెవిన్యూ సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్లి ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. దురాక్రమనకు గురైన ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు పెట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగినది.ఎవరైనా అతిక్రమించి బోర్డు తీసి వేయాలని చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసిల్దార్ రాఘవరెడ్డి తెలిపారు.
Post Views: 4,005