పంట పొలాలును సందర్శించిన ఖమ్మం కలెక్టర్ : నేటి గదర్ న్యూస్ : తల్లాడ ప్రతినిధి : ✍️ శ్రీనివాస్ : ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్జమిల్ ఖాన్ ఇ రోజు ఖమ్మం జిల్లా, తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామాలలోని రైతులను కలిసి, పంట పొలాలను సందర్శించారు.అనంతరం రైతులతో కలిసి పొలాల మధ్యనే కింద కూర్చొని రైతుల భాదలు విన్నారు. సాగర్ క్యానెల్ నీరు రాక వారి పంటలు ఎండిపోతున్న సంఘటనలు గురించి, అలాగే నకిలీ విత్తనాలు గురించి రైతులు పడే భాదలను కలెక్టర్ కి వివరించారు. ఎంతో కష్ట పడి పంట పండిస్తే, తీరా గిట్టుబాటు ధర లేక రైతులు బతుకులు అప్పులు కుప్పలు అవుతున్నాయి అని కలెక్టర్ కి తెలిపారు. కనీసం ఇ ప్రభుత్వం అయినా పండిన పంటలకు సరియైన మద్దతు ధర ఇప్పించి, రైతు రుణమాపీ విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.జిల్లా కలెక్టర్ స్వయంగా తమతో కలిసి పొలం గట్ల వెంట తిరుగుతూ, తమ మధ్య కింద కూర్చుని తమలో ఒకడిగా ఉండే విధానాన్ని చూసి తల్లాడ రైతులు సంతోషం వ్యక్తం చేసారు. మా కలెక్టర్ సారు చాలా సదా, సిధా మనిషి అని వారిలో వారు అనుకొన్నారు. ప్రభుత్వం ధ్యారా వచ్చే ప్రతి లబ్దిని రైతులకు నేరుగా అందేట్లు చేస్తానని చెప్పారు. ఇటీవల రెండు రోజులలో జరిగిన రైతు ఆత్మహత్య ల నేపథ్యంలో స్వయంగా కలెక్టర్ రైతు పంట పొలాల వెంట తిరుగుతూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొంటూటే, రైతులకు ధైర్యం కలుగుతుంది అని పలువురు అభిప్రాయ పడ్డారు.