నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:
అల్లూరి జిల్లా, హుకుంపేట మండలంలోని, దుర్గం పంచాయితీ, రణంకోట, సంపంగి పుట్టు, నంది పుట్టు , పట్టాం పంచాయితీ అమనగిరి, కుమ్మరి పుట్టు, గంగూడి -బూరు వలస,
తడిగిరి పంచాయితీ కొండ చీడి పుట్టు, బర్రెంగి బంద, గ్రామాల గిరిజనుల గ్రామాలకు తారు రోడ్లు గ్రాంట్ చేయాలనీ కోరుతూ సీపీఎం పార్టీ హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
అనంతరం ఐటీడీఏ లో జరుతున్న గ్రీవెన్స్ లో.జాయింట్ కలెక్టర్ బావన వశిష్టకు దరఖాస్తులు అందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండల రావు మాట్లాడుతూ… స్వాతంత్య్రం వచ్చి 77ఏళ్ల అవుతున్న. గత కాంగ్రెస్, టీడీపీ , వైసీపీ ప్రభుత్వాలు తారు రోడ్లు గ్రాంట్ చేయలేదని.. ఇల్లు కట్టుకోవాలన్న, అత్యవసర పరిస్థితు ల్లో 108,అంబులెన్సు రాక పోవటంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. సంపంగి పుట్టు, రణం కోట, అమన గిరి పీవీటీజీ గ్రామాలకు ప్రధాన మంత్రి జన్ మన్ పథకంలో, ఇతర నాన్ పీవీటీజీ గ్రామాలకు మిషన్ కనెక్ట్ ఐటీడీఏ తారు రోడ్లు గ్రాంట్ చేయాలనీ లేకుంటే.. హుకుంపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి దీక్షలు , ఆందోళనలు చెప్పడతామనీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో దుర్గం సూపర్ సర్పంచ్ చందన పాత్రుడు,
కేశవ రావు, అప్పారావు, భాస్కర్,నందు, లచ్చన్న,
,కిల్లో బేసు, బూరు బుద్రన్న,ప్రసాద్, జయరామ్, కామేష్,బాలరాజు, చిన్న బాబు,సన్యాసి,నీలకంఠం, రామకృష్ణ, కొండబాబు, కామరాజు,తదితరులు పాల్గొన్నారు.