అందుబాటులో 1లక్ష 66 వేల టన్నుల ఇసుక
• కొత్త ఇసుక పాలసీ అమలు జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
నేటి గద్దర్ పాడేరు న్యూస్:
అల్లూరి జిల్లా పాడేరు ఈనెల 8వ తేదీన ఇసుక విక్రయాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి ఐటిడ ఏ ప్రాజెక్టు అధికారులు, రవాణా శాఖ అధికారులు, గనులు భూర్భ శాఖ అధికారులతో జిల్లా స్థాయి సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతూరు డివిజన్ గుండాల -1 రీచ్ వద్ద 87,800 టన్నులు, గుండాల -2 రీచ్ లో 79,026 టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సీనరేజ్ టన్నుకు రూ.88 మాత్రమేనని మిగిలినవి లోడింగ్, పరిపాలనా చార్జీలు, జి.ఎస్.టి చార్జీలు నిబంధనల మేరకు చెల్లించ వలసి ఉంటుందన్నారు. అన్ని చార్జీలతో కలసి గుండాల – 1 రీచ్ లో ఉన్న ఇసుకకు టన్నుకు రూ.292 లు, గుండాల – 2 రీచ్కు రూ.237 లు చెల్లించాలని స్పష్టం చేసారు. ఇసుక విక్రయాలకు గిరిజన అభ్యర్థుల తో కూడిని ఏజెన్సీని గుర్తించాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ భావనా వశిష్ట, పాడేరు ఐటిడి ఏ పి. ఓ, వి. అభిషేక్, రంపచోడవంర పి. ఓ, సూరజ్ గనోరే, చింతూరు పి. ఓ. కావూరి చైతన్య, గనులు భూ గర్భ శాఖ అసిస్టెంట్ జియాలజిస్ట్ బి.రవికుమార్, రాయల్టీ ఇన్సెపెక్టర్ ఎస్.రాంబాబు, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.