★విద్యార్థులు తిరిగే పరిసరాల్లో పందుల స్వైర విహారం
★చెత్త తో దుర్వాసన
★డ్రైనేజీ మురుగు నీరు బయటకు పోవడానికి దారి లేదు
★Mla క్యాంప్ కార్యాలయం సమీపంలో అవస్థలు పడుతున్న విద్యార్థులు
★నేడు మణుగూరు డిగ్రీ కళాశాలలో పలు అభివృద్ధి పనులు ప్రాంభించనున్న MlA
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు): నిత్యం వందలాది విద్యార్థులు తిరిగే ప్రదేశం అది…. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అతి సమీపంగా, మణుగూరు బస్ డిపో పక్కన ఉన్న సీసీ రోడ్డుపై చెత్త పోయడంతో దుర్గంధం వ్యాప్తి చెంది పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దాని పక్కనే మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల,మరి కొంత దూరం పోతే సంక్షేమ వసతి గృహం ఉన్నది. ఆ సీసీ రోడ్డు నుంచి వందలాది మంది విద్యార్థులు అనునిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు.ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలంలో కాలంతో పని లేకుండా బస్ డిపో ఆయా కాలేజీల మధ్యన ఉన్న సిసి రోడ్డుపై అధిక సంఖ్యలో పందులు సైరవిహారం చేస్తున్నాయి. డ్రైనేజీ మురుగు నిల్వ ఉంటుంది. దీనితో పందులు ఆవాసాలుగా ఏర్పాటు చేసుకున్నాయి. తద్వారా ఆ అంతర్గత రహదారి నుంచి వెళ్లే ప్రజలు, విద్యార్థులు అనునిత్యం దుర్వాసనతో నరకయాతన పడుతున్నారు. వర్షాకాలం కావడంతో దుర్గంధం మరింత వెదజల్లుతుంది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టి సారించి వందలాది మంది విద్యార్థులకు దుర్గంధం, పందుల స్వైర విహారం నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. లేని యెడల విద్యార్థులు రోగాల బారిన పడే ఆస్కారం లేకపోలేదు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆయా కళాశాలల అధ్యాపకులు కోరుతున్నారు.
💥నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న పినపాక ఎమ్మెల్యే పాయం 💥
శనివారం ఉదయం 10 గంటలకు మణుగూరు ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలో దాదాపు 22 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తిచేయబడిన సిసి రోడ్లను పిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.