నేటి గదర్ ఫోటో మీది… వార్త మాది కబ్జాకు కోరల్లో తనుగులు చెరువు
★తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది హస్తం?
నేటి గదర్ వెబ్ డెస్క్ ,కరీంనగర్: కరీంనగర్ నగర్ జిల్లా
జమ్మి కుంట మండల పరిధిలోని తనుగులు చెరువు కబ్జాకు గురైనట్లు ఆ చెరువు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నేటి గద్దర్ ఫోటో మీది వార్త మాది అనే శీర్షికకు సమాచారం పంపించి వారి గూడెం వెళ్ళబోసుకున్నారు. తనుగులు కింద సుమారుగా 1200 ఎకరాలపైన వ్యవసాయ భూములున్నాయి. ఇది సుమారుగా ఆరు గ్రామాలకు అనగా బిజిగిరిషరీఫ్, నాగంపేట, రాచపల్లి, తనుగుల, గండ్రపల్లె. పాపక్కపల్లి గ్రామాలకు వ్యవసాయo కు నీరందిస్తుంది. అట్లాంటి చెరువుకు ప్రతి సంవత్సరం ఆక్రమణకు గురవుతున్నది. ఈ సంవత్సరం జూన్ నెలలో కొందరు రైతులు చెరువుకు అడ్డుకట్ట వేస్తూ, చెరువును దున్నుతూ పూడుస్తున్నారు.దీని మూలంగా 270 సర్వే నంబర్‌లో ఉన్న చెరువు సుమారు 20% కబ్జాకు గురైంది.
వీరిలో చాలామంది మండల రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వాళ్లు కొంతమంది ఉంటే ఏకంగా మండల రెవెన్యూ ఆఫీసు లో ఉద్యోగులుగా చేస్తున్నవారు ఈ కబ్జాకు పాల్పడుతున్నార ని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో జమ్మికుంట, మండల రెవెన్యూ అధికారులకు చాలా సార్లు విన్నవించినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని బాధిత రైతులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఆ కబ్జాను నియంత్రించినట్లయితే చెరువులో నీటిమట్టం ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ, కట్ట తెగకుండా చేసే అవకాశం ఉంటుంది. తాసిల్దార్ తక్షణమే స్పందించి చెరువు కబ్జాలకు పాల్పడుతున్న తాసిల్దార్ కార్యాలయంలోని ఇంటి దొంగలను పట్టుకొని చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేనియెడల ఆక్రమణలు మరింత పెరిగిపోయే ఆస్కారం ఉందని వారు తెలిపారు.