రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బుధవారం రోజు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రాంచందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిపై బీజేపీ నాయకులు అనవసర రాదాంతం చేయడం జరుగుతుందని ఆరోపించారు.తెలంగాణ అభివృద్ధి కొరకు ఆలోచించకుండా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు యూపీ వాళ్ల గురించి ఆలోచించడం ఆలోచించడం సమంజసం కాదన్నారు.గుజరాత్ లో నర్మద, సింధు,గంగ లాంటి నదులు అక్కడి ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేస్తున్నాయని ఆయన అన్నారు.ఇక్కడ తెలంగాణలో మూసీ నదిని అభివృద్ధి చేయడానికి వెనుకాడుతూ గుజరాత్ కు సపోర్ట్ గా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడం భవ్యం కాదన్నారు.ముఖ్యంగా ఎంపీలను కోరుకునేది ఏందంటే తెలంగాణ ప్రాంతానికి 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి మీ ద్వారా ఎన్ని నిధులు తీసుకు వస్తున్నారని ఏమీ అభివృద్ధి చేస్తున్నారని దుయ్యబట్టారు.కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా 10 నెలల్లో తెలంగాణకు తీసుకువచ్చిన అభివృద్ధి ఏం చేశారన్నారు.అదే యూపీలో లాంటి ప్రాంతాలలో వారు ఒక రూపాయి కట్టుకుంటే 8 రూపాయల వరకు ఇస్తున్నారని అన్నారు.మనము ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే 40 పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు.ఈ వివక్షత ప్రభుత్వాలకు ఉండకూడదన్నారు.మీరు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.తెలంగాణను అభివృద్ధి చేయకుండా గుజరాత్ లాంటి ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడం తగదన్నారు.మన తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి సిద్ధిరాములు, జహీరుద్దీన్,బొట్ల బాబు,అసాది రాజు తదితరులు పాల్గొన్నారు.