నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చిన గిరిజ నేతరులు మనపై పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. అలాగే మన ఉనికిని మనం కాపాడుకోకపోతె రాబోయే కాలంలో రాజకీయ, విద్యా,ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. భవిష్యత్తు తరుణంలో మనం ఎలా ముందుకు పోవాలి అనే విషంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు అయన తెలిపారు. ఈ సమావేశాని అన్ని ఆదివాసీ, ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి, మహిళ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యచరణ సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
Post Views: 32