రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 20:- మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోనాపూర్ పెద్ద తండాకు చెందిన మాలోత్ భాస్కర్ 36000 చెక్కును అందజేయడం జరిగిందని తెలిపారు.అలాగే చిగుళ్ల భాగ్య కు 11500 చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు ఆదేశాల మేరకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోనాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడి సిద్ధిరాములు, పిఎసిఎస్ డైరెక్టర్ గడ్డం సురేష్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిడి సతీష్, పార్టీ సీనియర్ నాయకులు పసుల అంజయ్య,చాకలి భీమయ్య,కేతావత్ మహేందర్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31