నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు.
ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం
ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల సింహగర్జన పోస్టర్ లను ఆవిష్కరించడం జరిగింది . ఈ సందర్బంగా ఐ ఎమ్ ఎల్ ఏ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటవ తేదీన సికింద్రాబాద్ జింకానా ( పరేడ్ ) గ్రౌండ్ లో జరిగే మాలల సింహాగర్జన బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . మాలలపై కేంద్ర రాష్ట్ర పాలక ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని మాలల ఆస్థిత్వాన్ని కాపాడుకోవాలి అని ఐక్య పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఇండియన్ మాల న్యాయవాదుల అధ్యక్షుడు రెంటాల ఆనంద్ , ప్రధాన కార్యదర్శి మర్రి ప్రకాష్ , కోశాధికారి కే ఎస్ చరణ్ , గౌరవ సలహాదారులు పి ఏ జె శేఖర్ రాజు , గోపోజి మోజెస్ క్రిస్థాపర్ , ప్రచార కార్యదర్శి పిడతల రాంమూర్తి , ఈసీ సభ్యులు గోరింట్ల శాంతరావు , గుడిసె అనిల్ కుమార్ , సభ్యులు మద్దెల వెంకటేశ్వర్లు , బాజీ జాళావతి , గుండమళ్ళ , భాస్కర్ , కంచర్ల విజయ్ , ఎస్ పి బాబు , పంబా నాగేశ్వరరావు , సుమన్ , చార్లెస్ , కొప్పుల కృష్ణ , కోపిల రవి , పి వినోద్ , పి చందు , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు .