నేటి గదర్ (జాతీయం),హైదరాబాద్ ప్రతినిధి:
యూపీలోని హథ్రస్ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ నివేదికను అందించింది. తొక్కిసలాటకు నిర్వహకులదే బాధ్యత అని, స్థానిక యంత్రాంగం కూడా ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్ పేర్కొంది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారని, షరతులు పాటించలేదని తెలిపింది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించి వారికి కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. పోలీసు వెరిఫికేషన్ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారని తెలిపింది. ప్రమాదం జరగ్గానే నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు అని సిట్ తన నివేదికలో వెల్లడించింది. అటు స్థానిక పోలీసులు, యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదని సిట్ తెలిపింది.
Post Views: 27