★ఇప్పటికే మండలాల వారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభల ద్వారా రైతుల అభిప్రాయ సేకరణ
★ పలుచోట్ల 10 ఎకరాల లోపు రైతులకి రైతుబంధు వర్తింపజేయాలని బహిరంగంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు?
★ అదే ఫైనల్ అవుతుందా?
★10 ఎకరాలలోపు నిబంధన పెడితే ఏజెన్సీ ఆదివాసి, పోడు రైతులు అనేకమంది కి రైతు భరోసా కష్టమే
★ మరొక్క రోజులోనే వెలువడనున్న రైతు భరోసా విధి విధానాలు
★ ఇప్పటికే బీజేపీ పార్టీ రైతులకు రైతుబంధు ఇవ్వాలని నిరసన కార్యక్రమాలు ముమ్మరం చేసింది
★రైతు భరోసా విధివిధానాల తర్వాత రైతుల కొరకు పోరుబాట పట్టనున్న ప్రతిపక్ష పార్టీలు
★ ప్రభుత్వ నిర్ణయం కొరకు లక్షలాది మంది రైతుల ఎదురు చూపులు
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి:
రైతుభరోసా పథకం అమలుపై నేటి నుంచి ఈ నెల 23 వరకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది. అందులో భాగంగా ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన కమిటీ నేడు పర్యటించి రైతులు, రైతు సంఘాలు, సాధారణ ప్రజలు, స్థానిక రాజకీయ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా స్కీమ్‌ను అమలు చేయాలి? అందిరికీ వర్తింపజేయాలా? ఏమైనా కండీషన్లు పెట్టాలా? అనే అంశాలపై అభిప్రాయాలు సేకరించనుంది. రైతుభరోసా పథకంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజినులను, ఆదివాసీలను చేర్చాలా, వద్దా? అనే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక జిల్లాల వారీగా 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న సంగారెడ్డి, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్లగొండ, 23న రంగారెడ్డి జిల్లాలో సదస్సులు నిర్వహించనున్నారు.
ఇప్పటికే మండలాల వారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభల ద్వారా రైతు భరోసా పథకం అమలు కొరకు ప్రత్యేక మహా జన సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయ సేకరణ జరిగింది.ఆయా సమావేశాల్లో పలుచోట్ల 10 ఎకరాల లోపు రైతులకి రైతుబంధు వర్తింపజేయాలని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు. మరొక వర్గం రైతులు మాత్రం అందరికీ రైతు భరోసా వర్తింప చేయాలని ప్రభుత్వానికి సూచించారు.కాగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులచే ప్రభుత్వమే 10 ఎకరాల లోపు నిబంధన చెప్పిందని రైతులు గుసగుసలాడుతున్నారు అదే ఫైనల్ అవుతుందా? అనే చర్చ కూడా జరుగుతుంది.10 ఎకరాలలోపు నిబంధన పెడితే ఏజెన్సీ ఆదివాసి, పోడు రైతులు అనేకమంది కి రైతు భరోసా నష్టపోయే అవకాశం లేకపోలేదు. మంత్రి పొంగులేటి మరో రెండు రోజులలోనే రైతు భరోసా విధి విధానాలు ప్రకటిస్తామని మంగళవారం ప్రకటించిన విషయం విధితమే.మరో ఒక్క రోజులోనే రైతు భరోసా విధి విధానాలు వెలబడనున్నాయి.కాగా రైతు భరోసా అమలు కొరకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష పార్టీలు వివిధ రూపాలలో నిరసన తెలిపారు.
ఇప్పటికే బీజేపీ పార్టీ రైతులకు రైతుబంధు ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయాలలో వినతి పత్రాలు అందజేసి నిరసన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వ విధివిధానాల తర్వాత రైతులకు అనువైన నిర్ణయాలు రాకుంటే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసనలు తెలపడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రైతు భరోసా విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయోనని రైతులు సర్వత్ర ఎదురుచూస్తున్నారు.