నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు : గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణంలో ధంసలాపురం వద్ద ఎగ్జిట్ మార్గం లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని బుధవారం ఆయా ప్రాంతాల కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కీలక హైవే నిర్మాణంలో ఎగ్జిట్ మార్గం లేక స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విన్నవించగా.. తనవంతుగా కీలక కృషి చేసినందుకు మంత్రికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటిని కలిసిన వారిలో 18వ డివిజన్ కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహర్ రావు, 23వ డివిజన్ కార్పొరేటర్ ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, కార్పొరేటర్ మడూరి ప్రసాద్, 16వ డివిజన్ కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి తమ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్ హోమ్స్ అధినేత దేవరపల్లి శ్రీనివాసరెడ్డి (డీఎస్సార్), మందడపు రామకృష్ణా రెడ్డి, శ్రీరామ్ హిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బెల్లం మనోహర్ రావు, నాయకులు మందడపు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, మడూరి సైదారావు, రామకృష్ణాపురం, పందిళ్ళపల్లి ముఖ్య నాయకులు, 16, 18, 21, 23 వ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.