నేటి గదర్ న్యూస్, హైదరాబాద్:
✍️ మొక్క ఉపేందర్ గౌడ్ హైదరాబాద్ ప్రతినిధి
★ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుండి వాజేడు మండలం ద్వారా గోదావరి బ్రిడ్జి మీదుగా గంజాయి ,డ్రగ్స్ ను తరలిస్తున్న ఇసుక లారీలు
★ములుగు జిల్లా ,ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర మూల సరిహద్దు ప్రాంతంలో ఉన్న అడవిలో అక్రమ గంజాయి సాగు చేసిన మాఫీయా బ్యాచ్
★కాజీపేట రైల్వేస్టేషన్ కి గంజాయి చేరవేసి అక్కడ నుండి హైదరాబాద్ , బెంగళూర్ , మద్రాస్ , డిల్లీ, ముంబాయి , కాన్పూర్, నాగపూర్ నాసిక్, ఉజ్జయిని ప్రాంతాలకు గాంజా జరలింపు
★కొందరు ప్రజా ప్రతినిధులు గంజాయి మాఫియాకు మద్దతు పలికి సిఎం అనుచరులమని ప్రచారం చేసుకొని గంజాయి తో
అక్రమ సంపాదన
★ గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత విద్యార్థులు
★ సీఎం రేవంత్ ఆశయానికి తూట్లు
★ సీఎం రేవంత్ రెడ్డి,నూతన డిజిపి జితేందర్ , IG చంద్ర శేఖర్ రెడ్డి లకు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు
★ రాష్ట్ర బీజేపీ లీగల్ సెల్ నాయకులు, సుప్రీంకోర్టు,హైకోర్టు న్యాయవాది పిట్టా శ్రీనివాసరెడ్డి
నేటి గదర్ న్యూస్ ,హైదరాబాద్ ప్రతినిధి,( జూలై 11 ):
ఛత్తీస్ గడ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వ్వాజేడు మండలం ద్వారా గోదావరి బ్రిడ్జి మీదుగా ఇసుక లారీల ద్వారా అధికారుల కళ్ళు కప్పి గంజాయి ,డ్రగ్స్ అక్రమ రవాణా జరుగు తున్న దని బీజేపీ లీగల్ సెల్ నాయకులు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది పిట్టా
శ్రీనివాసరెడ్డి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి నూతన డిజిపి జితేందర్ , IG చంద్ర శేఖర్ రెడ్డి లకు సామాజిక మాధ్యమాల ద్వారా వినతి పత్రం అందజేయడం జరిగిందని ఆయన గురువారం వెల్లడించారు .భద్రాచలం గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద గంజాయి డ్రగ్స్ ప్రతీ రోజూ పట్టుకుంటున్నారు కానీ వాజేడు, మల్లెకట్ల గోదావరి బ్రిడ్జి వద్ద రాయపూర్ నుండి జాతీయ రహదారి మీదుగా వెళ్ళే గంజాయి డ్రగ్స్ ఎందుకు పట్టుకోవడం లేదో అని పిట్టా శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్ ,మధ్యప్రదేశ్ రాష్ట్ర మూల సరిహద్దు ప్రాంతంలో ఉన్న అడవిలో అక్రమ గంజాయి సాగు చేసిన మాఫీయా బ్యాచ్ అక్రమ రవాణా చేసి లక్షలు కోట్లు రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. అక్కడ సాగు చేసిన గంజాయి పంటను ఇసుక లారీల మాటున కాజీపేట రైల్వేస్టేషన్ కి గంజాయి చేరవేసి అక్కడ నుండి హైదరాబాద్ , బెంగళూర్ , మద్రాస్ , డిల్లీ, ముంబాయి , కాన్పూర్, నాగపూర్ నాసిక్, ఉజ్జయిని ప్రాంతాలకు తరలించి ప్రజలను గంజాయి మత్తులో ముంచి దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి నీ నాశనం చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు.సీ గోదావరి బ్రిడ్జి మీదుగా గంజాయి రవాణా అరికట్టాలని డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాన వుండాలని కోరుకుంటున్నామని సీఎం కి ఆయా అధికారులకి పంపిన వినతి పత్రంలో పేర్కొన్నట్టు లాయర్ పిట్టా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ అక్రమ గంజాయి రవాణా వినియోగం మీద చర్యలు తీసుకోవాలని, ప్రజల విద్యార్థులు భవిష్యత్ కాపాడాలని , గంజాయి సేవించిన వారు దానికి బానిసలుగా మారి తమ ఆస్తులు పోగొట్టుకుని కుటుంబాలకు దూరమై చివరకు ఈ లోకానికి దూరమై కనుమరుగవుతున్నరని ఆవేదన వెలుగుచ్చారు. చిన్న పిల్లలకు, విద్యార్థులకు చాక్లెట్ రూపంలో విక్రయించి వారి బంగారు భవిష్యత్తు గంజాయి మాఫీయా బ్యాచ్ నాశనం చేస్తున్నారని పిట్టా శ్రీనివాసరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. కొందరు ప్రజా ప్రతినిధులు… గంజాయి మాఫియాకు మద్దతు పలికి సిఎం అనుచరులమని ప్రచారం చేసుకొని, రేవంత్ రెడ్డి ఆశయాలు , ఆదేశాలు , అభిప్రాయాలు , ఆలోచనలు భేఖాతారు చేసి, తుంగలో తొక్కి గంజాయి మాఫియా గ్యాంగ్ కు సహకరిస్తూ అక్రమ సంపాదన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనేకమంది జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి నిర్మూలనకు తమ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మాఫియా పై దృష్టి సారించి…. ఆయా లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు.