నేటి గదర్ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి:ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ శుక్రవారం మంజూరు చేసింది.సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తా లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ సీఎం కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది . తన అరెస్టు అక్రమమని ఢిల్లీ సీఎం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది . ఈ నేపథ్యంలో ఆయనకు మధ్యంతర మెయిల్ మంజూరు చేసింది . అయితే ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదులు చేస్తున్నట్లు తెలిసింది. సిబిఐ కేజ్రీవాల్ ని అరెస్టు చేయడంతో ఆయన జైలు లోనే ఉన్నాడు. ఈనెల 17 న సిబిఐ కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అప్పటివరకు ఆయన జ్యుడీషియల్ కస్టర్డ్ నిమిత్తం జైల్లోనే ఉండనున్నారు.
Post Views: 57