నేటి గదర్ న్యూస్ , చానల్స్ 12 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఎప్పుడు చూసినా నిండు కుండలా కనిపించిన పాలేరు జలాశయం గత ఏడాది నుండి నీళ్లు లేక వెలవెల పోతుంది.. గత ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో పాలేరు రిజర్వాయర్ లో నీళ్ళు అడుగంటి పోయాయి. అప్పుడప్పుడు త్రాగు నీటి అవసరాల కోసం జలాశయాన్ని నింపిన మరల డెడ్ స్టోరేజ్ కి చేరింది…ఈ ఏడాది వర్షా కాలం మొదలై నెల రోజులు అవుతున్న సరైన వర్షాలు లేక మండలంలో దాదాపు అన్ని చెరువు ఎండిపోయాయి.. ఒకపక్క ఖరీఫ్ సీజన్ మొదలైంది
రైతులు వరి నారు పోసి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు పడిన వర్షాలు నెలను తడిపాయి కానీ చెరువులను నింపే వర్షం మాత్రం రాలేదు.. రైతులు కూడా చెరువులు నింపే వర్షం రాకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.
Post Views: 192