★ బురదమయం అయిన వీధులతో 20వ డివిజన్ ప్రజల కష్టాలు మామూలుగా లేవు
★ అంటువ్యాధులు ప్రబలుతాయి అనే భయంతో వణుకుతున్న ఆ డివిజన్ ప్రజలు
★ మున్సిపల్ కమిషనర్ కి సమస్యను విన్నవించాం
★ మధిర 20డివిజన్ వాసులు
నేటి గద్దర్ న్యూస్, మధిర నియోజకవర్గ ప్రతినిధి. ✍️. వెంకటేష్ సుంకర:
వర్షం కురిసిందంటే మధిర మున్సిపాలిటీలోని 20 డివిజన్ గల భార్గవి నర్సింగ్ హోమ్ వెనక భాగం మెయిన్ రోడ్డు నుండి వచ్చే బురద నీరుమధిర పట్టణం నుంచి వచ్చే వరద, బురద నీరు మొత్తం ఆ డివిజన్ లోని సందు వీధుల నుండి ప్రవహిస్తుంది. దీనితో డివిజన్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వర్షం కురిసిందంటే కొద్ది రోజులపాటు చిన్న పెద్ద బయట అడుగు పెట్టలేని దుస్థితి .కాగా ఈ వరద నీరు S F S school మీదిగా వెళ్లాల్సి ఉంది,కానీ డ్రైనేజీ చిన్నది కావడం వల్ల ఆ మురుగు రోడ్డుమీద దొర్లుకుంటూ భార్గవి నర్సింగ్ హోమ్ వైపు ప్రవహిస్తోంది. తద్వారా ఈగలు దోమలు స్వైర విహార చేస్తున్నాయి, విష సర్పాలు సంచరిస్తూ అయా డివిజన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆవేదన వెలుబుచ్చారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని డ్రైనేజీ ని పునర్ నిర్మించాలని, మురుగునీరు ఇళ్లలోకి రాకుండా చూడాలని కోరారు.