కమీషనర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు…
ఆ మున్సిపాలిటీ ముందు ఉన్న రహదారిని…
స్వచ్ఛందంగా మరమ్మత్తులు చేస్తున్న ప్రజలు…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూలై 12:
మణుగూరు ప్రధాన రహదారి పూల మార్కెట్ సెంటర్ నుండి శివలింగాపురంకు వెళ్ళే రహదారి కట్ట చివరున రోడ్డు చిన్నపాటి వర్షానికి పెద్ద పెద్ద గుంతలు పడి అస్తవ్యస్తంగా మారింది. ఈ రోడ్డు వెంట రోజు వందలాదిమంది ఆటో టూవీలర్ ద్వారా మరియు నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులకు ఆ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా చిన్నపాటి వర్షాలకే పెద్ద పెద్ద గుంతలు పడి శిథిలావస్థగా మారుతుంది. ఇటీవల కురుస్తున్న వానలకు మోటార్ సైకిళ్ళు,పాదచారులు వెళ్ళలేక ప్రమాదకరంగా మారింది.వృద్దులు,గర్భిణీ స్త్రీలు మోటార్ వాహనంపై కింద పడ్డ సందర్బాలు వున్నాయి,ఈ విషయం పై చాలాసార్లు స్థానిక నాయకులకు,కమిషనర్ ఉమామహేశ్వర రావుకి స్థానికులు విన్నవించగా చాలా రోజుల తర్వాత ఏదో మట్టి తెచ్చి తూ.. తూ మంత్రంగా చేసి వెళ్లిపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో సమస్య మరింత తీవ్రమైంది.దీంతో మునిసిపల్ కమిషనర్ పని తీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,మండల కాంగ్రెస్ నాయకులు సారంపల్లి రాంరెడ్డి,బానోత్ లక్ష్మణ్,శ్రీరామ్ వాటర్ ప్లాంట్ తాటిపల్లి యశ్వంత్,సునీల్,సోను,ఉమేష్,అరుణ్ వారి మిత్ర బృందం ఆద్వర్యంలో స్వచ్చందంగా కూలగొట్టిన ఇల్లు ఇటుకల్ని ఆటోల ద్వారా తెచ్చి మరమ్మతులు చేసుకున్నారు.దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వని అందంగా మున్సిపాలిటీ ప్రజల పరిస్థితి ఉంది.స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలు నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా కమిషనర్ తీరు మారడం లేదని పలువురు మండిపడుతున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు స్థానికులు,వాహన చోదకులు బాటసారులు ధన్యవాదాలు తెలిపారు.