+91 95819 05907

మహిళా శక్తి” పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్

◆మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు పోవాలి.

✍️సిల్వర్ రాజేష్ ,నేటి గదర్ ప్రతినిధి మెదక్ 12 జూలై 2024.

మహిళా శక్తి” పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. 
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెర్ప్, స్త్రీనిధి సిబ్బందికి మహిళా శక్తి కార్యక్రమం అమలుపై ఏపీఎంలు, సీసీలు, జిల్లా మహిళా సంఘ సభ్యులతో కలసి కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సభ్యులకు మరింత చేయూత ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నదని,ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు కోటి రూపాయల రుణాలను అందజేయడంతో పాటు, ఎస్ హెచ్ జి మహిళలకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు..
మహిళలకు ఆర్థికంగా శక్తిమంతులను చేసి వారిని కోటీశ్వరులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడం మహిళా శక్తి పథకం ప్రధాన  ఉద్దేశాలని అన్నారు. సూక్ష్మ తరహా పరిశ్రమలను గుర్తించి, అందులో సంఘాలను ప్రోత్సహించడం, ఆయా సంఘాలలో మహిళలు తమ నైపుణ్యాలకు తగ్గ ఉత్పత్తులను ఎంచుకుని, ఆ ఉత్పత్తులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక సహకారం కోసం బ్యాంక్ లింకేజీల సదుపాయం కల్పించడం, ఉత్పత్తి అయిన సరుకులు మార్కెటింగ్ కు అవసరమైన ప్రణాళికలు, సహకారం అందివ్వడం మహిళాశక్తి పథకంలో భాగమని తెలిపారు.
మహిళా శక్తి పథకంలో జిల్లాలో 2024- 25 సంవత్సరానికి11 వేల 618. మంది మహిళా సంఘాల సభ్యులకు 106 కోట్ల 93 లక్షల రూపాయల విలువ గల కార్యాచరణ ప్రణాళికను చేపట్టడం జరుగుతుందని, మైక్రో ఎంటర్ప్రైజెస్,  పర్మనెంట్ స్టిచింగ్ సెంటర్లు, పాడి గేదెల పెంపకం, మొబైల్ ఫిష్ అవుట్ లెట్, పాల డైరీల ప్రోత్సాహం,  మీసేవ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ అనుబంధ పరికరాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ లు తదితర 14 రకాల జీవనోపాదులు ఇందులో భాగమని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టి అండగా నిలబడాలని తెలియజేస్తూ మహిళా శక్తి పథకానికి సంబంధించి లబ్ధిదారులను నిర్ణీత సమయంలోగా  గుర్తించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు మెప్మా పీడీ ఇందిర, అడిషనల్ డి ఆర్ డి ఓ సరస్వతి జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, మత్స్య శాఖ అధికారి నరసింహారావు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కృష్ణమూర్తి పశుసంవర్ధక శాఖ అధికారి విజయ శేఖర్ రెడ్డి ,జిల్లా సమైక్య అధ్యక్షురాలు నవనీత జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఏపీఎంలు ,సీసీలు, వివిధ మహిళా సంఘాల అధ్యక్షులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 19

Read More »

 Don't Miss this News !