ఎలుకలు కరిచిన విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ హరి ప్రియ
రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 12:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్లో 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచిన సంఘటనతో జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు హాస్టల్ లో శుక్రవారం రోజు ఉదయం మెడికల్ క్యాంపు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు చేసినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్ హరిప్రియ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టల్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని హాస్టల్ సిబ్బందికి సూచించిన్నట్లు తెలిపారు.ఎలుకలు కరచిన విద్యార్థులకు యాంటీ ఇంజక్షన్స్ వారికి ఇచ్చినట్లు ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నారని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ సాయి కృష్ణ, సూపర్వైజర్ శామల, ఈఎన్ఎం యశోద ఆశ వర్కర్లు పాల్గొన్నట్లు ఆమె తెలియపరచారు.