+91 95819 05907

అక్రమ కట్టడాలు – చర్యలు శూన్యం.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్.
* పలు దఫాలుగా విన్నవించిన, స్పందించని అధికారులు.
* ఫిర్యాదు చేసిన వారిపై నే కేసులు.
* ప్రజా ప్రతినిధుల ప్రమోయం ఉందనే అనుమానాలు… తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ కట్టడాలపై అనేక దఫాలుగా విన్నవించిన అధికారులు స్పందించక పోవడం , ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భూమిని కబ్జా చేసి , వెంచర్ల రూపంలో నిర్మాణాలు , రోడ్లు .. పైగా ఫిర్యాదు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం గమనిస్తుంటే ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమోయం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు అన్నారు. శుక్రవారం వివిధ సంఘాల నాయకులతో , బాధితులతో కలిసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని రోటరీ నగర్ అంతర్భాగ శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్ 15 లో సర్వే నెంబరు లో 3 ఎకరాల 10 కుంటల స్థలాన్ని 2011లో చేపూరి పద్మ , సంధ్యారాణి లు కొనుగోలు చేశారని చెబుతుండగా మరోవైపు కొందరు ఇది తమ భూమి అని పేర్కొంటూ ఆ భూమిలో బలవంతంగా ప్రవేశించి , మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా , హైకోర్టు జిల్లా కోర్టు లలో తుది తీర్పు పెండింగ్ ఉండగా ఇలా ప్రవేశించి , నిర్మాణాలు చేపట్టడం అమానుషమన్నారు. కమిషనర్ కు దీనిపై గతంలోని ఫిర్యాదు చేసామని, అయినప్పటికీ చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సివిల్ మ్యాటర్ కాస్తా శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు చేపట్టక పోవడం వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమోయం ఉందా ఏమిటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సందేహాన్ని వ్యక్తం చేశారు. అధికారులే విషయాన్ని నిగ్గు తెల్చాలని కోరారు. రాష్ట్రంలోనే ప్రశాంత వాతావరణ కలిగిన జిల్లా కేంద్రం ఖమ్మంలో ఇటువంటి దౌర్జన్యాలు జరగడం అధికారులు చర్యలు చేపట్టకపోవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటున్నామా ? అనేది అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడైనా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సానుకూలంగా స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను ఆపు చేయాలని , నిందితుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన బృందంలో బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు , రాష్ట్ర నాయకులు ఉపేంద్ర సాహూ , జిల్లా కార్యదర్శి మిర్యాల నాగరాజు , జిల్లా నాయకులు లాజర్ ,తెలంగాణ ఉద్యమకారులు రాచమల్ల ఉమా యాదవ్ , రెడ్డి బోయిన వరలక్ష్మి , మహాత్మ జ్యోతిబా పూలే సొసైటీ అధ్యక్షులు పెల్లూరి విజయ్ కుమార్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు భానుతు బద్రు నాయక్ , ఎంబీసీ జిల్లా చైర్మన్ బాసాటి హనుమంతరావు , తెలంగాణ ఉద్యమకారులు బాలిన భాస్కర్ రెడ్డి , శ్రీనివాస్ నాయక్ , వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఝాన్సీ , నాయకులు స్పందన , దేవుళ్ళ నాగేశ్వరరావు, తాడోజు వెంకటాచారి , కామన అనంతలక్ష్మి , చౌడం పద్మ , యాలమూడ ధనలక్ష్మి, ఆకారపు కృష్ణవేణి , ముల్లంగి పద్మ ,బాధితులు చేపూరి పద్మ , శ్రావణి ,నైనీషా ,నవజ్యోత్త్ తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !