రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 13:- మెదక్ జిల్లా నార్సింగి గ్రామానికి చెందిన వీరబోయిన యాదగిరి యాదవ్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఆయన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఆయనను నియామకం చేశారు.ఈ సందర్భంగా రామాయంపేట పట్టణంలో యాదగిరి యాదవ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తాను విద్యార్థి దశలో హాస్టల్లో ఉంటూ నేను గత 20 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్యతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి తాను బీసీ సంక్షేమం కొరకు పని చేస్తున్నానని ఆయన తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు హక్కుల కోసం పోరాడుతూ అన్యాయానికి గురవుతున్నారని వారికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి తాను నడుము బిగించి బీసీ సంక్షేమం కొరకు పని చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.బీసీ సంక్షేమంలో ఉన్న యువతకు ఎలాంటి సమస్యలు వచ్చిన వారి సంక్షేమం కోసం పాటు పడుతూ జిల్లా మరియు మండలం గ్రామాల వారిగా త్వరలో కమిటీలు వేసి బీసీల సంక్షేమం కొరకు తాను ఎల్లప్పుడు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.తాను బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమకమైన సందర్బంగా ఆయన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులకు మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు మండలం గ్రామాలలో ఉన్న బీసీ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరచారు.