రోడ్లపై ఇసుక లారీల నిలుపుదలపై TS MDC పిఓ ను నిలదీసిన సిపిఎం బృందం.
నేటి గధర్ న్యూస్ వెంకటాపురం జూలై 13:
ములుగు జిల్లా,వెంకటాపురం మండలంలో నడుస్తున్న ఇసుక ర్యాంపుల వలన ప్రయాణికులు అనేక అవస్థలు పడుతూ వాహనాలు ప్రమాదానికి గురికావడంతో శనివారం నాడు పాత్రాపురం,గ్రామం నుంచి మండల చివర గ్రామాల వరకు రోడ్లకు ఇరువైపులా లారీలను నిలుపుదల చేయటం వలన 35 కిలోమీటర్ల వరకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుందని ములుగు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబశివరెడ్డి,గ్యానం వాసు ఆందోళన వ్యక్తం చేశారు.సిపిఎం పార్టీ బృందం పరిశీలనకు వెళ్లగా అటుగా వచ్చిన టీఎస్ఎండిసి పిఓ శ్రీ రాముల వాహనాన్ని అడ్డుకొని,ఈ ఇబ్బందుల గురించి ప్రశ్నించారు.దానికి బదులుగా పిఓ సమాధానం చెబుతూ హెడ్ ఆఫీస్ నుంచి బల్కుగా (DD) లు వందలాది లారీలు రావడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు.రేపటి నుంచి నాలుగు రోజులపాటు లోడింగ్ నిలుపుదల చేస్తామని మండలంలో ఉన్న ర్యాంపుల అనుగుణంగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంతే కాకుండా లారీ డ్రైవర్ల దగ్గర ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్లు అదనంగా ఒక్కొక్క లారీకి 4000 రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని సిపిఎం బృందం పిఓ దృష్టికి తీసుకెళ్లగా అట్టి విషయంపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, గ్యానం వాసు,కట్ల నరసింహ చారి,కోకిల మాణిక్యం,బి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.