గాంధీనగర్ కాలనీలో వైద్యశిబిరం నిర్వహించిన డా,,కారం.మధు
నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని గాంధీ నగర్ కాలనీలోని కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ కారం.మధు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రోగులకు వైద్య పరిక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా,టైప్యాడు, డెంగ్యూ జ్వరలు నివారించుటకై తమ బాధ్యతగా వారి ఇండ్లలో ఉన్న గోలాలు,డ్రమ్ములు,ప్లాస్టిక్ డబ్బాలలోని నీటిలో తోక పురుగులు(దోమల లార్వాలు)లేకుండా శుభ్రం చేసుకోవాలని వివరించడం జరిగిందన్నారు.ఆ గ్రామంలో ఉన్న మురికి గుంటలు,కాలువలలో డ్రైడ్ యాక్టివిటీస్(ఆంటి లార్వల్ ఆపరేషన్) ఫీవర్ సర్వే కండాక్టు చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కృష్ణ,నరసింహరావు,ఏఎన్ఎం విజయలక్ష్మి, ఆశ కార్యకర్త పాల్గొన్నారు.
Post Views: 152