+91 95819 05907

కమిషనరేట్ లో డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు…

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.

నేటి గద్దర్ న్యూస్ స్టేట్ బ్యూరో జులై 14:
నైనారపు నాగేశ్వరరావు✍️

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలు అక్రమ గంజాయి రవాణా ఎప్పటికప్పుడు అరికడుతోనే ఉన్నప్పటికీ దానిని పూర్తిస్థాయిలో నివారణ చేయుటకు మత్తు పదార్థాల నియంత్రణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.దేశ భవిష్యత్తు అయిన యువతతో పాటు విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడుకుండా అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు విక్రయాలకు పాల్పడుతున్న నేరగాళ్ళపై ఉక్కుపాదాన్ని మోపి తద్వారా కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకై పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటుకు కమిషనర్ నిర్ణయించారు.ఒక రిజర్వ్ ఇన్స్ స్పెక్టర్ల,ముగ్గురు ఆర్ఎస్ఐలు మరి కొంత మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం పోలీసులు ట్రై సిటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా యువత మత్తు పదార్థాలను సేవించేందుకు అనువైన ప్రదేశాలతో పాటు కాలేజీలు,గంజాయి విక్రయాలు జరిగే పాఠశాలల,ప్రధాన కూడళ్ళు,సినిమా టాకీస్ లు, షాపింగ్ మాల్స్ పై దృష్టి సారించడంతో ప్రధానంగా రాత్రి సమయాల్లో నగరంలో గంజాయి వినియోగించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడం జరుగుతుంది.ఇందు కోసం ఈ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులతో నిరంతరం గస్తీ కొనసాగించడంతో పాటు పోలీసులకు అందిన సమాచారంతో స్థానిక పోలీసులతో కల్సి గంజాయి సేవించే ప్రాంతాలపై మెరుపుదాడి చేసి గంజాయి ప్రియులను అదుపులోకి తీసుకోని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,అలాగే గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై కూడా ఈ విభాగం పోలీసులు ప్రత్యేక నజర్ ఉంటుంది.ప్రధానంగా గంజాయి వినియోగంచే వ్యక్తులను కట్టడి చేయడం ద్వారా గంజాయి మత్తులో జరిగే నేరాలను అదుపు చేసేందుకు మరింత సులభమవుతుందని కమిషనర్ తెలిపారు.అలాగే ఈ మత్తు పదార్థాల నియంత్రణతో పాటు యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా అలాగే ఈ గంజాయి మహమ్మారి మీ ఇంటి దరి చేరకుండా మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడకుండా ఉండాలంటే తల్లిదండ్రులతో పాటు ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా మత్తు పదార్థాల నిర్మూలన కై ప్రజలు పరోక్షంగా గంజాయి నియంత్రణలో భాగస్వాములు కావలసిన అవసరం ఉండదని,ఇందు కోసం మత్తు పదార్థాలను,సేవిస్తున్న, విక్రయిస్తున్న,రవాణా చేస్తున్న “8712584473” నంబర్ కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడటంతో పాటు అధిక మొత్తంలో గంజాయి సమాచారం అందించిన భారీగా నగదు పురస్కారం అందజేయ బడుతుందని తెలిపారు. గంజాయి రహిత పోలీస్ కమిషనరేటే మనందరి ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !