★వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
నేటి గదర్ న్యూస్ జులై 14: వైరా నియోజకవర్గ ప్రతినిధి. శ్రీనివాసరావు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపినందున భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ గారు సూచించారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు అని తెలిపారు
గ్రామాలలో పాత ఇండ్లు,గుడిసెలు, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి,గోరువెచ్చనినీటిని తాగండి, నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించకండి అని తెలిపారు
సీజన్ వ్యాధులు సోకకుండా చూసుకోండి…
ముఖ్యంగా రైతులు వ్యవసాయ క్షేత్రంలో పనులకు వెళ్ళినప్పుడు విష సర్పాలు తో జాగ్రత్త వుండాలని, కాలనీలలో కరెంటు స్తంభాలను తాకవద్దు అని తెలిపారు…









