నేటి గదర్ న్యూస్, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రతినిధి:
ఆల్ ఇండియా ఈ న్యూస్ పేపర్స్ జర్నలిస్ట్ యూవియన్ సమావేసం ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ
సమావేశంలో యూనియన్ సభ్యుల అభిప్రాయాల మేరకు విశాఖపట్నానికి చెందిన పి. కిషోర్ కుమార్ ను ఏఐఈజేయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం సులభతరం చేయడం తో పాటు జర్నలిస్టులకు అవసరమయ్యే అన్ని వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వారికి అన్ని వసతులు అందేలా చూస్తారని , తన 18 సంవత్సరాల ప్రముఖ మీడియా సంస్థల్లో , సేవా సంస్థల్లో అనుభవం కలిగిన కిషోర్ కుమార్ సేవలు గుర్తించి ఆయనకు గౌరవప్రదమైన స్థానాన్ని యూనియన్ కల్పించిందని సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈసంద్భంగా కిషోర్ కుమార్ కు యూనియన్ సభ్యులు అభినందనలు తెలిపారు.
కిషోర్ కుమార్ మాట్లాడుతూ
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నించడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాల ప్రముఖ మీడియా సంస్థల్లో అనుభవంతో పాటు హెచ్ ఆర్ సీ ఆర్టీఐ ఆర్గనైజేషన్ లో జాతీయ కార్యదర్శిగా వివిధ రకాల సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఏపీలో గల జర్నలిస్టులు ఎవరైనా తమ సమస్యలు ఏమిటో తెలిపితే పరిష్కారానికి న్యాయబధ్దంగా సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా న్యాయ పోరాటానికి సిద్దంగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్న ఏఐఈజేయు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మీడియా ఫెడరేషన్ అకాడమీ జాతీయ అధ్యక్షుడుముఖ్యఅతిథిగా ఈసంపెళ్లి వేనన్న హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నార్లగిరి మహేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొక్క ఉపేందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామోదర్ గౌడ్, చిరంజీవి గౌడ్, కుమారస్వామి అఖిల భారతీయ ఎలక్ట్రానిక్స్ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ యూనియన్ గౌరవ సలహాదారులు ఆర్కే యాదవ్, బజ్జుర్ల శ్రీనివాస్ తెలంగాణ అధ్యక్షులు చుంచు కుమార్ బూజుగుండ్ల జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు.