నేటి గదర్, జూలై 15,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల నుంచి తాలిపేరు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు సోమవారం 22 గేట్లలలో ఓ 5 గేట్లను రెండడుగుల మేర ఎత్తి 5958 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో దిగువన తేగడ వద్ద గల కల్వర్టు నీటిలో మునిగిపోయింది. తాలిపేరు ప్రాజెక్టులోకి ఇంకా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నదని, దీంతో సిబ్బందిని మరింత అప్రమత్తంగా ఉంచాలని అధికారులు సూచించారు.
Post Views: 530