నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున,వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఖమ్మం అధికారులు అలర్ట్ అయ్యారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ అభిషేక్ అగస్త్య ఓ ప్రకటనలో తెలిపారు. వర్షం, ముంపు కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు “79012 98265” అనే ఎమర్జెన్సీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.పాత ఇళ్లలో ఉండరాదని గోడలు కూలి ఇల్లు పడిపోయా ప్రమాదం ఉందని వారు సూచించారు. అలాగే ఖమ్మం మున్నేరు వాగు ఉదృతం గా ప్రవహించే వాగు పరిసర ప్రాంత ప్రజలు ముఖ్యం గా అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
Post Views: 37