+91 95819 05907

సిని క్రైమ్ లాంటి రియల్ క్రైమ్ .బయటపడ్డ అక్రమ సంబంధం. భార్య, ఇద్దరు పిల్లలు హత్య,

… నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి , ✍️ సతీష్ కుమార్ జినుగు.
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ అక్రమ సంబంధం బయటపడింది. అయితే సినిమా స్టోరీని తలదన్నేలా ఉంది ఈ అక్రమ సంబంధం. సినిమాలు కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదా అనిపిస్తోంది. అక్రమ సంబంధం పెట్టుకొని భార్య, పిల్లలను చంపేసిన ఓ ఘనుడు దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 48 రోజుల తర్వాత అసలు నిజం బయటపడింది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఒక ఆస్పత్రిలో పిజియోతెరపిస్టుగా పని చేస్తున్నాడు. అతనికి భార్య , ఇద్దరు పిల్లలున్నారు. అయితే ప్రవీణ్ తాను పని చేస్తోన్న ఆస్పత్రిలోని సోని ప్రాన్సిస్ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ప్రియురాలు మోజులో పడి భార్య , పిల్లలను నిర్లక్ష్యం చేశాడు.
సోని ప్రాన్సిస్‌తో కలిసి ఉండాలని భావించిన ప్రవీణ్ తన భార్య, ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈక్రమంలోనే కారులో గ్రామానికి వెళ్తుండగా, పోస్టుమార్టంలో ఎంత మోతాదులో పాయిజన్ డోస్ ఇస్తే రాదో గూగుల్ లో వెతికి తెలుసుకొని తన భార్యకు కారులో మత్తుమందు సూది ఇచ్చి, 4 ఏళ్ల లోపున్న ఇద్దరు ఆడ పిల్లల గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి ముగ్గుర్ని చంపేశాడు.
ఆ తర్వాత కారును ఒక చెట్టుకు గుద్ది రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. అయితె చనిపోయిన భార్య, ఇద్దరు పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానంతో భార్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కారులో ఒక ఇంజక్షన్, ప్రవీణ్ ఫోన్లో గూగుల్ హిస్టరీతో ప్రశ్నించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట మండల సీనియర్ నాయకులకు దక్కిన గౌరవం

** మెదక్ జిల్లా జనరల్ సెక్రెటరీగా చెరుకు సిద్ధిరాములు గౌడ్ నియామకం. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్

Read More »

డిసిసి కార్యదర్శిగా బుడ్డ భాగ్యరాజ్ నియామకం

** నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 20. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నియామకం చోటుచేసుకుంది. పార్టీ బలోపేతం లక్ష్యంగా, లయన్ బుడ్డ భాగ్యరాజ్ ను జిల్లా

Read More »

మాసాయిపేట మండల కేంద్రంలో మొదటి గ్రామసభ

** పాల్గొన్న తాసిల్దార్ జ్ఞానం జ్యోతి. సర్పంచ్ ఫోరంల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరన్నగారికృష్ణారెడ్డి. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చ్ 20. మాసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం మొదటి

Read More »

ఠాను నాయక్ ఉద్యమ స్పూర్తి తో గిరిజన హక్కుల కై పోరాడాలి

*రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్* *బడ్జెట్ లో గిరిజనులకు 25% నిధులు కేటాయించాలి* ….. *గిరిజన సంఘం రాష్ట్ర నేత భూక్యా వీరభద్రం* ఖమ్మం లో ఐటిడిఎ ఏర్పాటు కై 30న

Read More »

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

 Don't Miss this News !