★బిఆర్ఎస్ పార్టీ అల్లపల్లి మండల అధ్యక్షులు పాయం.నరసింహరావు
నేటి గద్దర్ అళ్ళపల్లి:
రైతు రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను బిఆర్ఎస్ పార్టీ అల్లపల్లి మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు మాటాడుతూ. తప్పు పట్టారు ఆ మార్గదర్శకాలు రైతులకు శాపంగా రైతులకు ఉరితాళ్లని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు రైతులు అదేవిధంగా ఐదు ఎకరముల రైతులకు ఒకే బ్యాంకు దగ్గర అప్పు ఇలా అనేక రకాలుగా మరింత మార్గదర్శకాలతో రైతులను గందరగోళంలో నేట్టినారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిందేంది మీరు ఇప్పుడు చేస్తుందేందని అయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరి రుణాలను మాఫీ చేస్తాం ఆగస్టు 15లోగా రైతులందరినీ రుణ విముక్తులను చేస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకాలు ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా ఏ విధమైన మార్గదర్శకాలు లేకుండా రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.