నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
నేడు హిందువులకు పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ. లోకాలను పాలించే విష్ణుమూర్తి నేటి నుంచి యోగా నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి రోజున ఇంట్లోని వారంతా తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుని, గుమ్మాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. లక్ష్మీనారాయణులను పూజించాలి. ఆరోగ్యం సహకరించిన వారు ఉపవాసం ఉండొచు. మద్యం, మాంసం తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. రేపు ఉదయం స్వామిని పూజించి ఉపవాసం వదలాలి.
Post Views: 21