నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దొంగ దెబ్బ తీశారు. నిన్న రాత్రి దోడా జిల్లాలో జవాన్లపై భారీ ఆయుధాలతో జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేశ్ థాపా, నాయక్ డొక్కరి రాజేశ్, సిపాయిలు బిజేంద్రసింగ్, అజయ్ కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడిన మరో సైనికుడిని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కొన్నిరోజులు ఉగ్రవాదుల కాల్పులు ఎక్కువయ్యాయి.
Post Views: 35