★ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు పహానిపై రుణాలు పొందిన ఏజెన్సీ రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలి
★ లేనియెడల అనేకమంది గిరిజనేతర రైతులకు తీవ్ర అన్యాయం
★ బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్
నేటి గదర్ న్యూస్,పినపాక: ఏజెన్సీలో బ్యాంకులలో రైతు రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ పథకం అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ డిమాండ్ చేశారు. ఏజెన్సీలో గతంలో బ్యాంకులలో పహానిలపై రుణాలు పొందిన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని… వారికి కూడా మినహాయింపు ఇచ్చి రుణమాఫీ పథకం అమలు చేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి నివేదికలు తెప్పించుకొని వారికి న్యాయం చేయాలని కోరారు. లేనియెడల అనేకమంది ఏజెన్సీ గిరిజనేతర రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ గిరిజనేతర రైతులకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.