నేటి గదర్ న్యూస్,పినపాక:గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వాగులు వంకలు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఆర్ అండ్ బి రోడ్లకు ప్రమాదం పొంచి ఉంది. పినపాక మండలం,పాత రెడ్డిపాలెం గ్రామంలో రోడ్డుకు గండి పడే అవకాశం ఉన్నందున గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. తక్షణమే అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి.
Post Views: 177









