మా గ్రామలలో మధ్యం,నాటు సార దుకాణాలను అరికట్టాలి
*చిరుమళ్ళ గ్రామపంచాయతి కార్యదర్శి రమక్రిష్ణకు వినతిపత్రం అందజేసిన మహిళలు*
నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్న 8 గ్రామాలలో మద్యం,గుడుంబ అమ్మకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని మహిళా సమైక్య సభ్యులు గ్రామపంచాయతి కార్యదర్శి రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాని యువకులు ఎక్కువగా మద్యం సేవించి జూలయిగ తిరుగుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి బెల్ట్ షాపులు,గుడుంబా అమ్మకపు దారులను నియంత్రణ చేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. లేనిపక్షంలో అన్ని పంచాయతీలలో మహిళలు వచ్చి దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సునీత, రాణీ,మాణిక్యం,రమాదేవి, చంద్రకళ,ఉదయ, కుమారి, కృష్ణవేణి, లక్ష్మి,మాజీ సర్పంచ్ పాయం. నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.









