– ప్రజా పాలన సేవా కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన ములుగు జిల్లా కలెక్టర్.
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జులై 19:
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజా పాలన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు రాని దరఖాస్తుదారులు ప్రజా పాలన సేవా కేంద్ర ద్వారా డేటా సవరణ( కరెక్షన్ ) చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
శుక్రవారం గోవిందరావు పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసి, ప్రజా పాలన దరఖాస్తులు పరిష్కరిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి, ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించిన విషయం విదితమే. పలు కారణాల వల్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలు పొందలేకపోతున్న అర్హులైన వారికి లబ్ది చేకూర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను కొనసాగిస్తోందని ఆన్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ దరఖాస్తుదారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 10026 దరఖాస్తులను గ్రామపంచాయితీల వారీగా డేటా తయారు చేసి గ్రామ పంచాయితిలలో ముందస్తు సమాచారం తెలిపి సంబంధిత గ్రామాల్లో ఒక రోజు సేవా కేంద్రం ఏర్పాటు లోపాలను సవరించి, పరిష్కారానికి ఆస్కారం ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. సాంకేతిక సమస్యలతో కూడిన దరఖాస్తుల సమగ్ర వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. అర్జీదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ సాజిదా బేగం, సీనియర్ అసిస్టెంట్ దుర్గెష్, జూనియర్ అసిస్టెంట్ ఇక్బాల్, ఆపరేటర్ ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.