నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, జులై 19:
వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెo. 6309842395. 08717-293246 ఏర్పాటు. నూతన పరిజ్ఞానంతో గోదావరి కరకట్ట నిర్మాణ పనులు. గోదావరి ప్రభావం పెరిగింది ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. శుక్రవారం ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం కరకట్ట మరమ్మతు పనులను, దొడ్ల, కొండాయి బ్రిడ్జి గోదావరి వరద ఉధృతి ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, వచ్చే మూడు రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన దృష్ట్యా మండల ప్రత్యేక అధికారులు తహసిల్దార్లు, ఎంపీడీఓలు, ఎం పి ఓ లు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఐదు మండలాల్లో 80 ముంపు ప్రాంతాలను గుర్తించామని చెరువులు వాగుల దగ్గర ఉన్నటువంటి సుమారుగా 1000 నుండి 2000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. వరద ముంపుకు గురవుతున్న వాజేడు ,వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయి గూడెం మండలాలలో 135 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. దీనితోపాటు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో లక్నవరం నుండి రెండు బోట్లను సమకూర్చుకున్నామని అదేవిధంగా
ఎన్డీ ఆర్ఎఫ్ టీం తో పాటు నాలుగు బోట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
గోదావరి పరిహార ప్రాంతాలలోని గ్రామాలకు గోదావరి జలాలతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతన పరిజ్ఞానంతో కరకట్ట నిర్మాణంలో చేపట్టడం జరుగుతుందని, ప్రస్తుత సమయంలో ఎగువేల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగిన దృశ్య ముంపు గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గత పక్షం రోజుల క్రితమే మంత్రి సీతక్క తో కలిసి కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని, దానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారని, నూతన పరిజ్ఞానంతో నిర్మించే ఈ పనులు శాస్త్రంగా ఉండబోతున్నాయని అన్నారు.
జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా వారికి నెలకు సరిపడే నిత్యవసర వస్తువులను సిద్ధం చేశామని, అత్యవసర సమయాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బోట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను నియమించామని ఆయన తెలిపారు. వీటితోపాటు అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కరకట్ట కొట్టుకపోకుండా నూతన నిర్మాణం ఎంతగానో దోహదపడుతుందని, రానున్న రోజులలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు.
గతంలో కురిసిన వర్షాలకు దొడ్ల కొండాయి మధ్యలో ఉన్న వంతెన కూలిపోవడం వల్ల కొండాయి దొడ్ల గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మొన్న నిన్న ఎగువ కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతి కొంచెం పెరిగినందువల్ల వంతెన (బ్రిడ్జి) కొట్టుకు పోవడం జరిగిందని ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట రాకపోకలకు ఫైర్ డిపార్ట్మెంట్ ఒక బోట, పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన రాపిడ్ ఫోర్స్ టీం కు సంబంధించిన ఒక బోటును ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు దొడ్ల, కొండాయి ప్రాంతాల్లో సెల్ ఫోన్స్ సిగ్నల్స్ తక్కువ ఉండటం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాకీటాకీలను సిబ్బందిని ఏర్పాటు చేశామని పోలీస్, ఐటీడీఏ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని
అన్నారు. వర్షాకాలంలో ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా ఉండాలన్నారు.వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. అత్యవసర సేవలకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ సమయంలో వర్షం వస్తుందో తెలీదు కాబట్టి ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగి పొర్లే నది నాలాలు దాటకుండా గ్రామాలలో టాం టాం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొంగిపొర్లే వాగులు, రహదారుల్లో ప్రజలు రవాణా చేయకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని సూచిక బోర్డ్లు ఎర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలకు తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు ఐటిడిఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్. 6309842395. ల్యాండ్ లైన్ నెంబర్ 08717-293246 లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
వరద ఉధృతి ఎక్కువ ఐతే వెంటనే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రజలు సహకరించాలని
కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డి సి ఎస్ ఓ రాంపతి,
ఇర్రిగేషన్ ఈ ఈ జగదీశ్వర్, కాంట్రాక్టర్, తహసిల్దార్ జగదీష్, ఎంపి డి ఓ రాజ్య లక్ష్మి, ఎంపి ఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.