నేటి గదర్ కరకగూడెం:రాష్ట్రవ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఆయన సందర్భంగా రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదే అదునుగా భావించి సైబర్ కేటుగాళ్లు రైతుల అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ప్రతి రైతు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మీకు ఏదైనా వాట్సప్ ద్వారా గుర్తు తెలియని మెసేజ్లు వచ్చిన,ఓటీపీలు వచ్చిన ఎవరితో పంచుకోకుండా ఉండాలి అని ఆయన అన్నారు.ఏదైనా సైబర్ బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లో ఫిర్యాదు చేయండి అని ఆయన తెలిపారు.
Post Views: 47