నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను 510 జీవోలో భాగంగా 4000 మందికి జీవో సవరణ చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాను వాట్సప్ సోషల్ మీడియా ద్వారా తెలియ పరిచారు. ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ 4000 కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపాలని, జీవో 510 వెంటనే రిలీజ్ చేయాలని మంత్రికి లెటర్ రాశారు. ప్రభుత్వ అధికారులతో ప్రతి ఒక్కరికి ఒక క్యాడర్ ఫిక్స్ చేసి క్యాడర్ వారీగా ఎంత వేతనం ఇవ్వాలో నూతన కమిటీతో శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. కనీసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగులను పలు రాష్ట్రాలలో రెగ్యులరైజేషన్ చేశారు ఆ రాష్ట్రాల పేర్లు మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని కూడా రెగ్యులరైజ్ చేయాలని రామ రాజేష్ ఖన్నా లేఖలో కోరారు.