★డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాచలంలో రెండు తెలుగు రాష్ట్రాల సెమినార్….
చందా లింగయ్య దొర వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే
ఆదివాసి హక్కుల కోసం చట్టాల కోసం 1974 లో ఏర్పడిన *జాతీయ ఆదివాసి గిరిజన సంఘం* *”గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను”* డిసెంబర్ 26,27,28 తేదీల్లో భద్రాచలంలో నిర్వహించనునట్లు ఆదివాసి సంఘాల జేఏసీ వెంకటాపురం మండల కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో విలేఖరు లో సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది.గిరిజన అభ్యదయ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం పోరాటాల, ఉద్యమాల ఫలితంగా ఆదివాసి హక్కులు, చట్టాలు ప్రజల్లో చైతన్యo ఏర్పడ్డాయని దాని ఫలితంగానే జీవో 3 ద్వారా వేలాది మంది ఉద్యోగాలు పొందారని, అదే విధంగా అటవి హక్కుల చట్టం చట్టం 2006, PESA చట్టం ద్వారా ఆదివాసులు లబ్ధి పొందారని
ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఆదివాసులు మెరుగైన అభివృద్ధి కోసం తోడ్పాలని కోరారు…
ఈ సందర్భంగా డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాచలంలో జరుగు సెమినార్లు జయప్రదం చేయాలని కోరారు…
ఈ కార్యక్రమంలో…
ఆదివాసి సంఘాల జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ, ఆదివాసి పొలిటికల్ జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి, ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ దొర, జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర, డివిజన్ నాయకులు మడి నాగ శంకర్, జిల్లా నాయకులు కొమరం శ్రీను తదితరులు పాల్గొన్నారు.