రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 20:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని ఐదో వార్డు కాలనీవాసుల ఇచ్చిన సమాచారం మేరకు రాత్రి భారీ వర్షానికి ఐదో వార్డులోని పాత పెట్రోల్ పంపు వెనుక ఇండ్ల మధ్యన నీరు నిలువ అయినటువంటి ప్రాంతాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పరిశీలించారు.అనంతరం నీరును ప్రస్తుతానికి జెసిబి ద్వారా కాలువ తీసి ఇండ్లు మధ్య నుండి నీరును బయటకు పంపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమిషనర్ దేవేందర్ చంద్రపు కొండల్ రెడ్డిమున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కాలేరు ప్రసాద్ కాలనీవాసులు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
Post Views: 89