నేటి గదర్ ఉమ్మడి వెల్దుర్తి మండలం జులై 20
మెదక్ జిల్లా ఉమ్మడి వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతుల రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి రైతులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో
కలాల్ శేఖర్ గౌడ్, పెంట రెడ్డి ,నర్సా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామ్ రెడ్డి, రాజీ రెడ్డి, నర్సింలు, పోచయ్య, కృష్ణా రెడ్డి, సిద్దిరామ్ రెడ్డి, సంజీవ్ గోపాల్ రెడ్డి,నరేష్, తదితరులు పాల్గొన్నారు.