రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 21:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఆగస్టు నెల కు సంబంధించిన రేషన్ బియ్యం మొదటి వార్డు ఎస్సీ కాలనీలో రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని గత సోమవారం ప్రజావాణిలో మండల తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించామని కాలనీ వాసులు తెలిపారు.జులై నెలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఎస్సీ కాలనీలో పంపిణీ చేయిస్తారని మేము అనుకున్నాము కాని చేయలేదన్నారు.ఈ రేషన్ విషయంలో తాము నాన్న ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.ఇప్పటికైనా వచ్చే ఆగస్టు నెల నుండి అయినా సంబంధించిన రేషన్ బియ్యాన్ని తప్పకుండా మా ఎస్సీ కాలనీలో రేషన్ షాపు ఏర్పాటు చేయించి పంపిణి చేయాలని మండల తహసీల్దార్ ను తాము కోరుతున్నట్టు బైరం కుమార్ గావు భాస్కర్ బైరం శంకర్ తెలియపరచారు.
Post Views: 35