★సుమారు 20 లక్షలతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించిన పోచారం పురపాలక సంఘ చైర్మన్
నేటి గద్దర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా బ్యూరో:-
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ వెంకట సాయి నగర్ కాలనీలో ఆదివారం సాధారణ నిధులు అంచనా వ్యయం దాదాపు 20 లక్షలతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం కాలనీవాసులతో పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామని, దశలవారీగా పనులు పూర్తి చేస్తున్నామని, తెలిపారు. ప్రతి ఒక్కరు వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తడి పొడి చెత్తాలను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని దోమల నివారణ చర్యలో భాగంగా నీటితోట్లను పాడైపోయిన కూలర్లలో వర్షపు నీరు నిలవకుండా దోమల ఉత్పత్తి కాకుండా నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలని ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు కాలనీవాసులు శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, పొడుగు నరసింహ, బిల్లా రాజేశ్వర్, గణేష్ సోమేశ్,కాలనీవాసులు,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.