నేటి గదర్, జూలై 22,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని గొందిగూడెం గ్రామ రైతులకు సోమవారం ఐటీసీ బంగారు భవిష్యత్తు వారు వృక్ష సంయుత వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పీక కాలంలో ఒక పంటకు బదులుగా రెండు పంటలను పండించుకుంటే రెండు పంటల నుండి ఆదాయం పొందవచ్చు అని వివరిస్తూ జామాయిల్ మొక్కలను అగ్రో మోడల్ గా నాటడం జరిగింది. ఈ వృక్ష సంయుత వ్యవసాయం వలన ఏక కాలంలో ద్వి పంటల నుండీ ఫలసాయం పొందవచ్చు తద్వారా రైతుకు అధిక ఆదాయాలు వస్తాయి అని వారు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు (MSK), సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ రంగారావు, కమ్యూనిటీ ఆర్గనైజర్ ముత్యాలరావు, గ్రామ సర్పంచ్ పాయం భద్రమ్మ, రైతులు పాల్గొన్నారు.