నేటి గదర్, జూలై 22,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని డ్యాం వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి కిన్నెరసాని నీటిమట్టం 402.40 అడుగులకు చేరుకుంది. ఈ మేరకు కిన్నెరసాని డ్యామ్ లోకి 6వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, డ్యాంలోని 2 గేట్లను ఓపెన్ చేసి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 135