నేటి గదర్, జూలై 22,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 47.10 అడుగులకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6.51 గంటల సమయానికి 43 అడుగుల వద్దకి గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో జిల్లా కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. 10 గంటల వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటిమట్టం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Post Views: 688