నేటి గదర్ న్యూస్,పినపాక: పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం సీఐ గా వెంకటేశ్వరరావు సోమవారం సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, , పేకాట, ఇసుక అ క్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
Post Views: 198