నేటి గదర్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి
జూరాల జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో లక్షా 42 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 27 గేట్లు తెరిచి దిగువకు 133497 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.216 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.115 టీఎంసీలుగా ఉంది.
Post Views: 29